Telugu health tips
అన్ని జబ్బులకు పెద్ద కారణం ప్రేగులు లో సంవత్సరాల నుంచి తిన్న తిండి కొంచం కొంచం అలా పేరుకుపోయి ఎండిపోయి ఉండడమే..
పాడైపోయిన తిండి బయటకు రాకుండా లోపలే పేరుకుని పొట్ట సైజు మాత్రం పెంచుకుంటూ ఉంటుంది..
పొట్ట చాలా పెద్దగా ఉన్నా కానీ, కొంచం తిన్నా సరే కడుపు నిండిపోతుంది..
తినలేరు.. పని చేయ లేరు..
మన ప్రేగులు లోపల టర్కీ టవల్ లాగా పోగులు ఉంటాయి..
ప్రేగుల్లో ఉన్న ఆ పోగులు శుభ్రంగా క్లీన్ అయితే మాత్రమే, ప్రేగులు మనం తిన్న తిండిని పిసుకుతూ దాని ద్వారా వచ్చే జ్యూస్ ని పోగులతో పీల్చుకుంటూ మనకు శక్తిని ఇవ్వగలుగుతాయి ..
ఈ పోగులు మొత్తం చెత్త కుండీ లాగా నిండి పోయి ఎండిపోతే, మనం ఎంత తిన్నా సరే, మనకు శక్తీ రాదు..
శక్తీ రాకుండానే తినేసా కదా అని పని చేస్తూ ఉంటె, అప్పుడు శరీరం లో ఉన్న మిగతా అవయవాలు పాడు అవ్వకుండా ఉండడం కోసం, ఆ పని చేసేవాడిని శరీరం, పని చేయనివ్వకుండా ఏదో ఒకటి చేస్తుంధీ..
మనం శరీరం చెప్పేది విని, ముందు అన్ని పనులు ఆపేసి, ఆ ప్రేగులు శుభ్రం చేసే పని మీద ఉండాలి..
ప్రేగులు శుభ్రం అయ్యే వరకు, శక్తీ కి తగ్గట్టుగా పని చెయ్యాలి..
ప్రేగులు నిండిపోయి ఎండిపోయి శక్తీ రానివాళ్లు, ఎక్కువ సేపు కూర్చుని కళ్ళు మూసుకుని మెల్లిగా గాలిని పీల్చి, కొంచం సేపు ఆపి, తర్వాత మెల్లిగా వదులుతూ ఉంటె, ఆ గాలి కొవ్వు ని కరిగించి, గాలిలో ఉన్న నీటిని వాడుకుని కూడా ప్రేగులను శుభ్రం చేస్తూ శక్తిని సంపాదించుకుంటుంది ..
గాలి కూడా సరిగ్గా పీల్చకపోతే అప్పుడు శరీరం లో ఉన్న ఆత్మ, మనిషిని పడుకోబెట్టేసి అది గాలిని పీల్చుకుని, శక్తీ వచ్చిన తర్వాత మళ్ళీ లేపుతుంది..
ప్రేగులు శుభ్రం చెయ్యాలంటే ప్రతీ రోజు ఇలా చెయ్యాలి..
ఒక పాత్ర లో నుంచి రెండు చేతులతో నిండుగా నీళ్లు 8 సార్లు తీసి ఇంకో పాత్రలో వేసి అవి ఎంత వచ్చిందో చూసి అన్ని నీళ్లు ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసేశాక కాళీ కడుపున తాగాలి..
1 లీటర్ నుంచి 2 లీటర్ నీళ్లు వరకు వస్తుంది..
కూర్చుని మాత్రమే మెల్లి మెల్లిగా తాగాలి..
కడుపు నిండిపోతే ఆగి ఆగి తాగాలి..
ఇలా ఒకే సమయంలో తాగడం వల్ల రాత్రి అంతా ఎండిపోయిన పొడవాటి పేగులు చివరి వరకు నీళ్లు వెళ్లి ఒకేసారి తడుపుతుంది..
నీళ్లు తాగిన తర్వాత, పొట్ట కదిలేలా చిన్న చిన్న వ్యాయామాలు అరగంట చెయ్యాలి...
నడుము పక్కులకు, ముందుకు, వెనక్కు వంచుతూ, చుట్టూ తిప్పుతూ చెయ్యాలి...
అప్పుడు తాగిన నీటి వల్ల ప్రేగులు బాగా క్లీన్ అవుతాయి..
ఇలా ఉదయం తాగాల్సిన నీటిని ముందు రోజు రాత్రి అంతా రాగి బిందెలో ఉంచి, నీటికి పూజ చేసి, పాత్రకు బొట్టు పెట్టి ఉదయం ఆ నీళ్లు తాగితే ఇంకా మంచిది..
రాగి బిందె లో నీళ్లు పొసే ముందు ఆ నీటిని స్టీల్ పాత్ర లో మరిగించి చల్లారాక పోస్తే ఇంకా మంచిది..
నీళ్లు ఎంత సేపు మరిగితే అంత ప్రాణ శక్తీ వస్తుంది...
సగం అయిపోయేదాకా కూడా మరిగించొచ్చు...
బంగారు ఇంకా వెండి నాణాలు వేసి మరగపెడితే ఇంకా మంచిది..
తాగే ముందు అందులో 1 స్పూన్ త్రిఫల పొడిని (ఉసిరి, కరక్కాయ,తానికాయ లు కలిపి చేసిన పొడి) వేసి కలిపి కొంచం గోరు వెచ్చగా వేడి చేసి తాగితే ఇంకా మంచిది..
ఉట్టి పొడికి బదులుగా, ముందు రోజు రాత్రి ఒక చిన్న స్టీల్ లేదా ఇనుప కప్పులో కొంచం నీళ్లు పోసి, 1 స్పూన్ త్రిఫల పొడిని (ఉసిరి, కరక్కాయ,తానికాయ అనే 3 కాయలు కలిపి చేసిన పొడి) రాత్రంతా నానబెట్టి అది ఉదయం తాగే నీటిలో కలిపి తాగితే ఇంకా మంచిది..
ఇలా రోజుకు ఒకసారి మాత్రమే ఒకే సమయంలో ఎక్కువ నీళ్లు తాగాలి..
తర్వాత దాహం వేసినప్పుడు మాత్రమే దాహం తీరేవరకు తాగాలి..
తర్వాత ఉదయం పూట దాహం వేసినా, ఆకలి చేసినా , నీరసంగా ఉన్నా కడుపు నిండా వెజిటల్ జ్యూస్ లేదా, సూప్ తాగాలి..
జ్యూస్ లు ...
పుదీనా ఎక్కువ, కొత్తిమీర తక్కువ, తులసి ఆకు ఇంకా వేసి జ్యూస్ చేసి తాగాలి ...
బూడిద గుమ్మడికాయ జ్యూస్..
7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి జ్యూస్..
కాకారకాయ జ్యూస్..
తవుడు జ్యూస్...
కొబ్బరి పాలు ...
బాదం పాలు ...
జ్యూస్ లో రుచి కి తేనె, కొంచం నిమ్మ కాయ వేసుకుని తాగాలి..
శొంఠి పొడి కూడా వేసుకుంటే షుగర్ ఆదుపులో ఉంచుతుంది..
ఇంకా ఆకలి వేస్తే రాత్రి నానా బెట్టిన బాదం, వేరుశెనగ గుళ్ళు, జ్యూస్ తో కలిపి తాగుతూ తినొచ్చు ...
పళ్ళు కూడా తినొచ్చు, కానీ ముందు జ్యూస్ లు తాగాలి...
వండిన పదార్థాలు రోజుకు ఒకసారి మాత్రమే తినాలి..
చలి కాలం లో రెండు సార్లు తినొచ్చు..
అందులో సగం పప్పు ఇంకా కూరగాయలు అలా ఉండేలా తినాలి...
అన్ని రుచులు ఉండేలా కలిపి తినాలి..
మెల్లిగా నమిలి నమిలి తాగేలాగా రుచిని అనుభవిస్తూ గమనిస్తూ గంట సేపు తినాలి..
కంగారు కంగారు గా తినకూడదు...
నెయ్యి వేసుకుని తినాలి...
కొరికి కొరికి నమిలి నమిలి తినే లాగ ఏదైనా చక్రాలు లేదా వేపిన వేరు శనగలు నంచుకుంటూ తినాలి...
ఎండు కొబ్బరి ముక్కలు కూడా తొనొచ్చు...
ఎండు కొబ్బరి నమిలి తింటే కారులోకి ఆయిల్ వస్తుంది.. జాయింట్లకు ఆయిల్ పడుతుంది.
భోజనం వండిన గంటలో తింటే మంచిది.. లేదా 4 గంటల లోపు తినాలి...
అంతకన్నా లేట్ గా తింటే, అది కడుపులో 3 రోజులు పాటు ఉండి ప్రేగులను ఇంకా పాడు చేస్తుంది..
టీవీ చూస్తూ మాట్లాడుతూ తినకూడదు..
తినడానికి ఒక అరగంట ముందు సగం కడుపు నిండేలా నీళ్లు తాగాలి..
తినేటప్పుడు అవసారానికి తగ్గట్టుగా నీళ్లు లేదా సూప్ తాగొచ్చు..
కానీ తిన్న తర్వాత మాత్రం గంట వరకు నీళ్లు తాగకూడదు..
గంట తర్వాత దాహం వేసిన ప్రతీసారి దాహం తీరేదాకా బాగా తాగాలి...
సాయంకాలం పూట కడుపు నిండా భోజనం చేసినట్టుగా పళ్ళు తినాలి...
చలి కాలం అయితే రాత్రి పూట టిఫిన్స్ చెయ్యొచ్చు...
ఎండు కొబ్బరి, వేరు సెనగ గుళ్ళు , బాదం, పిస్తా వేపి కలిపి తింటే మంచిది..
రాత్రి పడుకునే ముందు, తిన్న అన్నం అరిగిపోయి కడుపు కాలీగా ఉండాలి...
అంటే పడుకోవడానికి కనీసం 3 గంటల ముందే తినెయ్యాలి...
అలా రాత్రి పడుకునే ముందు కడుపు కాలీగా సంతోషంగా ఉంటె, అప్పుడు సగం నీళ్లు కలిపిన పాళ్ళు లో 1 చెంచా త్రిఫల 3 కాయల పొడిని వేసి కలిపి తాగాలి...
తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగి పడుకోవాలి ...
తీపి లేకుండా పాలు తాగలేక పోతే,
అప్పుడు ముందే ఒక గ్లాస్ నీళ్లు తాగేసి,
తర్వాత నీళ్లు కలపకుండా ఉన్న పాలలో రుచికి సరిపోయినంత తేనె కలిపి, నెయ్యి కలిపి, 1 స్పూన్ త్రిఫల 3 కాయల పొడిని వేసి కలిపి తాగాలి...
తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగి పడుకోవాలి...
సొంత ఆవు పాలు అయితే, ఆ ఆవుని చూసుకునే అతనికి జబ్బుకు తగిన గడ్డి తిని పాలు ఇస్తుంది..
సూర్యుడు రావడానికి, పోవడానికి, ఇంకా మధ్యలో నెత్తిపై ఉన్నప్పుడు అరగంట అటు ఇటు
ఏమీ తినకూడదు...
తాగకూడదు..
పడుకోకూడదు...
ఆరోగ్యం బాగోవాలంటే ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడాలి...
భూమికి దగ్గర్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇంట్లో పడుకుంటే మంచిది...
భూమి మట్టి మీద నడుస్తూ ఉండాలి..
ఉప్పు చింతపండు వేసిన నీటిలో అరగంట లేదా గంట సేపు కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, నానబెట్టి బాగా కడిగి తినాలి..
లేదా మందులు జల్లినవి కడుపులోకి వెళ్తాయి...
అన్నం గంజి వంచితే బాగా అరుగుతుంది, తాగడానికి గంజి వస్తుంది..
ఈ గంజి లో తవుడు వేసి మరగపెట్టి అన్నం తినేటప్పుడు తాగేస్తే అప్పుడు తవుడు తీసిన నష్టం పోతుంది..
Comments
Post a Comment